ఈ చలికాలంలో బెల్లం వినియోగం ఎక్కువ చేస్తే శరీరానికి ఎంతో ఆరోగ్యం . ఇందులో కాల్షియం,ఇనుము పాస్పరస్ మూలకాలు ఉంటాయి . ఎముకలను ధృడంగా ఉంచుతుంది . రక్త వృద్ధికి తోడ్పడుతుంది కూడా . చక్కర బదులు బెల్లం వాడకం వల్ల రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి . యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ రోగనిరోధక శక్తి ని పెంచుతుంది . నీరసంగా అనిపిస్తే అప్పుడో చిన్న బెల్లం ముక్క తిన్న వెంటనే శక్తి అందుతుంది . బెల్లంలో ఎనర్జీ బార్ లు తయారుచేసుకొంటే వేరుశెనగలు,నువ్వులు,జీడిపప్పు వంటి ఏ పప్పులు బెల్లం కలిపినా చాలా రుచిగా ఉంటాయి . పిల్లలు ఇష్టంగా తింటారు కూడా . పాలల్లో చక్కర బదులు బెల్లం వదినా రుచీ ఆరోగ్యం కూడా .

Leave a comment