Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
ప్రేమతో వండి వడ్డించు అంటే ఈ కాలపు అమ్మాయికి అర్ధం అవుతుందా ? వంట అంటే కుకింగ్ అంతే కానీ ఎలా వండితే ఏం దానికి ప్రేమ యాడ్ చేయటానికి అదేమైనా అల్లామా ? ఉల్లిపాయ ? కాకపోవచ్చు . కానీ ప్రేమతో ఇష్టంతో చేసిన వంట అంటే తప్పనిసరిగా రుచిగానే ఉంటుంది. ప్రేమగా ఇష్టంగా వండితే శ్రద్ధగా వండుతాం కదా ఏలోపం రాకుండా అవతలివాళ్ళకు ఆ ఇష్టం చేరాలన్నంత తపన తో వండుతారు కనుక తినేవాళ్లకు కూడా ఆ మెసెజ్ చేరుతుంది. వంట చేసిన వాళ్ళ పట్ల ఇష్టంతో తినేవాళ్లు తింటారు కనుక రుచి అద్భుతంగా ఉంటుంది. గందర గోళం ఎందుకు గని ఒక ఉదాహరణ ఆస్పత్రి లో రోగులను ప్రేమతో పలకరిస్తూ పీక నర్స్ ఇంజెక్షన్ చేస్తే పుట్టే నొప్పికీ చిటపటలాడుతూ చేసే నొప్పికీ తేడా ఉంటుంది. అలా మొహం మాడ్చుకుంటే ముందు జబ్బు ఎక్కువవుతుంది. ఏమంటారు ? అలాగే పేమకు రుచి పెంచే గుణం ఉండటమే కాదు ప్రేమ భారీ నివారిణి కూడా. ఇది సరైన పరిశోధనే కదా !
Categories
WhatsApp

రుచిని పెంచే ప్రేమ

March 4, 2017June 16, 2017
1 min read

https://scamquestra.com/18-informaciya-ob-afere-iz-zagranicy-16.html

By admin

View all of admin's posts.

Post navigation

Next: ముత్యాల నగలు కొత్తవిలా మెరవాలంటే
ముత్యాల నగలు ఎప్పటికీ మారని ఫ్యాషన్. ముత్యాల మెరుపు తగ్గకుండా కొత్తగా మెరవాలంటే తగిన జాగ్రత్తలు కావాలి. మేకప్ పెర్ఫ్యూమ్ వంటివి అప్లయ్ చేశాకే నగలు ధరించాలి. అలాగే రాత్రికేక హ్యాండ్ బాడీ క్రీమ్ రాయటానికి ముందే ముత్యాల నగలు ఉంగరాలు తినేయాలి. వాటిని మెత్తని వస్త్రంలో తుడవాలి. బాగా ఆరనివ్వాలి. అలాగే ముత్యాలను మురికి పట్టాయనిపిస్తే మెల్ట్ సోప్ నీరు కలిపి శుభ్రపరచాలి. అమ్మోనియా లేదా డిటర్జంట్స్ కలిపిన నీళ్లతో ముత్యాలు శుభ్రం చేయకూడదు. అల్ట్రాసోనిక్ క్లీనర్ తో కూడా ముత్యాలు ఆభారణాలు ఉంచవద్దు . బరకగా వుండే వస్త్రంతో శుభ్రం చేయవద్దు. వీటివల్ల ముత్యపు పైపొర పాడవుతుంది. ఈ పోర పోతే ముత్యాలు మాములు పూవుల్లా కనిపిస్తాయి . మిగతా ఆభారణాలతో కలిపి ముత్యాల నగలు ఉంచకూడదు. సులువుగా వీటిపైనా గీతాలు పడతాయి. ముత్యాల నగల కోసం ప్రత్యక జ్యూవెలరీ బాక్స్ వాడటం మంచిది.
Next: 15 వ ఏళ్ల పూ పూసింది
ప్రపంచం లోనే ఖరీదైన పూలు అంటే ఎంత వుండి వుంటాయో ఊహించండి. వెయ్యి పదివేలు లక్ష .... ఎంతవరకైనా పర్లేదు. ఏకంగా 30 కోట్ల రూపాయలకు ఈ పూలను కొనుకున్నారట ఒక పెద్ద మనిషి. దానిపేరు జూలియట్ రోజ్. నిజంగానే ఈ అద్భుతమైన పూవు ఖరీదు 30 కోట్ల రూపాయలే. మరి పదిహేడేళ్లు ఎదురు చూసారు. ఈ పూవు వికసించటం కోసం డేవిడ్ ఆస్టిన్ అనే ప్రపంచ ప్రఖ్యాత నర్సరీ నిర్వాహకుడి తోటలో ఇది పూసింది. పదిహేడేళ్ల పాటు ఎన్నో ప్రయోగాలు చేసి ఈ కొత్తదనం రోజు సృష్టించాడు. ఒక పూల ప్రదర్సనలోమొదటిసారి వీటిని ప్రపంచానికి పరిచయం చేస్తే ఆ పూల అందానికి ఆకృతికీ పరిమళానికి ముగ్ధుడై ఒక వ్యక్తి వేలం పాట లో ముఫై కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఈ రకం రోజులలో ఇది మొదటిడి కాబట్టి దానికింత ధర.

Related Post

మామిడి పండు పైన పంచ రత్నాలు రాయవచ్చు. తిన్న వెంటనే సంతోషం పట్టలేక కవితలు రాయచ్చు. నోరారా కీర్తించవచ్చు. అంత కమ్మగా వుండే మామిడి పండు మనకు దొరికేది ఏడాదిలో రెండు మూడు నెలలు అయితే సంవత్సరం పొడవునా సరిపోయేన్ని ఔషధ గుణాలు ఈ పండులో పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో, కార్బోహైడ్రేట్స్ తక్కువ మోతాదులోఉంటాయి. పిండి పదార్ధం, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల మామిడి పండు తింటే బరువు పెరుగుతామన్న భయం అక్కర్లేదు. అంచేత ప్రతిరోజూ ఒక మామిడి పండు చొప్పున తింటూ వుంటే నీరసం, నిస్సత్తువ రావు. అజీర్తి చేయదు. ఎక్కువ ఇరోన్వుంటుంది కాబట్టి రక్తహీనత పోతుంది. విటమిన్ ఎ, ఇ, సేలోనియంలు గుండె సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయి. సీజన్ అయిపోయేదాకా రోజుకో పండు తినేస్తేనే మంచిది.

మామిడి తో మెరిసే చర్మం

April 16, 2021
1 min Read
ఆలియా భట్ కు ఈ ఏడాది కపూర్ అండ్ సన్స్ తో సుభారంభం ఇచ్చింది. డియర్ జిందగీ మంచి వసూళ్ళు అందుకుంది. ఇక ఉడ్తా పంజాబీ విడుదలకు ముందే సంచలనం.జాతీయస్థాయి లో పెద్ద చర్చ నడిచింది ఈ చిత్రం తో ఇప్పటి వరకు ఆలియాకున్న ఇమేజ్ వేరు. ఈ ఏడాది ఈ పాత్ర తో వచ్చిన ఇమేజ్ వేరు. అందమైన అమ్మాయి గా నే కాదు. పరిమితి చెందిన నటిగా కూడా పేరు తెచ్చుకుంది. రాబోయే సంవత్సరంలోకూడా ఆమె డైరీ నిండుగానే వుంది. చేసే పాత్రలో ఇమిడిపోయే ఆలియా తన నటన తో అన్ని కోణాలు బయటకు తీస్తుంది. కపూర్ అండ్ సన్స్ లో ఆలియా హాస్య కోణం భయట పెట్టింది. ఉడ్తా పంజాబీ లో బీహార్ నుంచి వచ్చిన యువతి గా ఆలియా నటించింది. ఈ సినిమా కోసం ఆలియా బీహార్, పంజాబీ కలగలిసిన యాసలో మాట్లాడే శిక్షణ తీసుకుంది. పూర్తి డి-గ్లామర్ పాత్రలో నటించి మెప్పించిన ఆలియా భట్ ఉత్తమ నాయికగా రేస్ లో ముందుంది.

కెరీర్ రేస్ లో ఆలియా భట్

December 29, 2016
1 min Read

ఇదే తొలిసారి

February 10, 2021
0 mins Read

టెర్రర్ ఫ్యాషన్

June 13, 2018
0 mins Read

Leave a comment Cancel reply

You must be logged in to post a comment.

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.