స్కిప్పింగ్ రోప్ చేతిలో వుంటే మీమాట వింటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  జంక్ ఫుడ్ ఫ్యాట్ ను కరిగించే శక్తి స్కిప్పింగ్ కే ఎక్కువ అంటున్నారు. ఇది బెస్ట్ కార్డియో వ్యాయామం గుండె వేగం పెరగడం ద్వారా రక్త ప్రసరణ వేగం పుంజుకుంటుంది. స్కిప్పింగ్ తో శరీరం మొత్తానికి వ్యాయామం అందుతుంది. గంట సేపు వ్యాయామం చేస్తే 1300 క్యాలరీలు కరుగుతాయి. దీని వల్ల బ్యాలెన్స్, కొ ఆర్డినేషన్, నడక తీరు మెరుగావ్వుతాయి. అందుకే అద్లెట్లు, రన్నర్లు ట్రైనింగ్ లో స్కిప్పింగ్ చేస్తారు. తొడలు, పిక్కలు, చేతులు, పొట్టు కడుపు కండరాళ్ళు బిగుతుగా బలంగా మారుతాయి. కీళ్ళ పైన తక్కువ వత్తిడి పడుతుంది కనుక రన్నింగ్ కంటే స్కిప్పింగ్ మేలైనది ఎముకల సామ్ద్రిత పెరుగుతుంది. కొవ్వును, క్యాలరీలను కరిగించుకోగల వ్యాయామ పరికరం స్కిప్పింగ్ రోప్ ఒక్కటే.

Leave a comment