ప్రపంచం లోనే తొలి అనెస్థటిస్ట్  రూపాబాయి ఫర్దూన్జీ . హైద్రాబాద్ మెడికల్ కాలేజి నుంచి  పట్టా తీసుకొన్నారు . ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు . అక్కడ బాల్టిమోర్ లోని జీన్స్ హప్ కిన్స్ హాస్పిటల్ లో పాశ్చాత్య వైద్యంలో డిగ్రీ కోసం చేరారు . తరువాత స్కాట్లాండ్ లో ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ లో చదువుకున్నారు . అప్పట్లో అనెస్థీషియా లో ,ఏ యూనివర్సిటీ లోనూ స్పెషలైజేషన్ కోర్స్ లు లేవు . అయినా రూపాబాయి ఎనస్థీస్ట్ గా పరిశోధనలు చేస్తూ ఫిజిక్స్ ,కెమిస్ట్రీ లలో డిప్లమాలు పొందారు .  అనెస్థిస్ట్ గా సేవలందించారు . హైద్రాబాద్ లోని చాదర్ ఘాట్ హాస్పిటల్ లో సూపరెంటెంట్ గా పనిచేసి 1920 లో రిటైరయ్యారు .

Leave a comment