లారీల్లో లిఫ్ట్ అడుగుతూ కేరళ నుంచి నజీరా నౌషాద్ నేపాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు 50 రోజుల లక్ష్యంతో వెళ్లి తిరిగి క్షేమంగా వచ్చింది. ఒంటరిగా స్త్రీ ప్రయాణం చేయగలదు అన్న స్లోగన్ తో 33 ఏళ్ల నజీరా ఈ ప్రయాణం చేసింది. ఆమె ట్రావెల్ వ్లోగర్. ఎంతో మంది ఫాలోయర్స్ ఉన్నారు. గత సంవత్సరం లడక్ వరకు రోడ్డు మార్గం ద్వారా ట్రావెల్ చేసింది. తర్వాత ఇరవై ఐదు రోజుల్లో లక్షద్వీప్ యాత్ర పూర్తి చేసింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు టాల్కా నుంచి ట్రెక్ చేయాలి 2860 మీటర్ల ఎత్తున్న లుల్కా 5364 మీటర్ల ఎత్తున బేస్ క్యాంప్ నడవాలి అంటే ఎనిమిది రోజులు పడుతుంది నేను ఏడు రోజుల్లో చేరుకున్నాను అంటుంది నాజీరా దొరికిన వాహనంతో ప్రయాణం చేస్తూ నజీరా  చేసే ఈ యాత్రలు ఎంతో మందికి స్ఫూర్తి.

Leave a comment