కేరళ స్పెషల్ శారీస్ తెలుపు, గోధుమ వర్ణం లో బంగారు పూత జరీ అంచుతో ఉంటాయి. చీరెలు మెత్తగా బావుంటాయి కానీ సాదాగా ఉంటే తేలిపోతాయి అనుకొంటే చక్కని డిజైనర్ బ్లౌవుజ్ తో అందం తేవొచ్చు. లేదా చీర మొత్తం బంగారు, జరీ, త్రేడ్ వర్క్ తో నెమళ్ళు, పూలు దేవతా మూర్తుల డిజైన్, లేదా వట్టి ఫ్యాబ్రిక్ పెయింట్ తో కూడా చీరే లుక్ మార్చవచ్చు. దీన్నే  ఫ్యధాన్ డిజైనర్స్ రూపం మార్చేసి ఆధునిక అందాలు జోడించేస్తున్నారు. కేరళ డిజైన్ లో సల్వార్ కమీజ్, లేహంగ్, క్రాస్ రూప్ స్కర్ట్ ఇవన్ని ప్రత్యేక సందర్భాల్లో వేసుకోనేంత అందంగా తయారు చేయవచ్చు. జరీ దారాలతో బ్లౌవుజ్ మొత్తం ఎంబ్రాయిడరీ చేయిస్తే ఇక నగల అవసరం కూడా లేకుండా పోయినట్లే.

Leave a comment