Categories
WoW

సాలెపురుగు సిల్క్ దారపు డ్రెస్ ఇదే.

మన్యుషులు ఈ ప్రపంచంలో దేన్నీ విడిచి పెట్టేట్టు లేదు. అందంగా కనబడిన వన్నీ వాళ్ళ సొంతం కవాల్సిందే. అమెరికాలోని నేచురల్ హిస్టరీ మ్యుజియం న్యూయార్క్ లో  వుంటుంది. ఆ మ్యుజియంలో ఓ బాక్స్ లో బంగారం రంగులో మెరిసిపోతూ ఓ డ్రెస్సు కనిపిస్తుంది. దీనికో ప్రత్యేకత వుంది. Golden spider silk అంటే సాలెపురుగు సిల్క్ దారం అన్నమాట. ఈ బంగారు రంగు డ్రెస్సును నాలుగు సంవత్సరాల పాటు 70 మంది గోల్డెన్ ఆర్ట్ అనే సాలెపురుగు గూళ్ళు వెతికి అందులో దారం తీసి భద్రపరిస్తే ఇంకో 12 మంది ఆ దారంలో నుంచి బంగారు రంగు దారం వేరు చేసి ఈ డ్రెస్సు తయ్యారు చేసారు. ఇదే మొట్ట మొదటి సాలెపురుగు సిల్క్ తో తయ్యారు చేసిన డ్రెస్. ఈ సాలెపురుగు గూడు అల్లిగోనే దారం బంగారు రంగులో వుంటుంది. ఆ దారాలలో సిల్క్ కూడా వుంటుంది. ఆ సిల్క్ దారంతో అల్లిందే ఈ డ్రెస్.

Leave a comment