నీహారికా,

మనం చాలా తరచుగా సారీ అన్న పదం ఉపయోగిస్తాం. కానీ అన్ని రకాల సారీలు ఒక లాంటివి కాదు. మనమ్చేసిన పని వలన ఎదుటి వారికి బాధ కలిగిస్తే, ఇబ్బంది కలిగిస్తే తప్పనిసరిగా చెప్పే సారీ కరక్టే. ఆ సందర్భంలో సారీ అన్న పదం వుపయోగించి తీరాలి. ఇలా సారీ చెపితే ఎన్నో సమస్యలు దగ్గరకు రాకుండానే పోటాయి. ఇలా సారీ చెప్పడం మంచి అలవాటే అయినా అనవసరపు సారీలు వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. ఆత్మవిశ్వాసం లేకనే ప్రతి దానికి సారీ అనేస్తుంటారు. కానీ ఒక్క నిమిషం ఆగి క్షమాపణ కోరేంత తప్పు మనం చేశామా, లేదా ఎదుటి వాళ్ళను తృప్తి పరచడం కోసం చెప్పుతున్నామా ఆలోచిస్తే మనకు వాస్తవం తెలిసిపోతుంది. ఎదో పరిస్థితి చక్కదిద్దేద్దాం కదా అని త్వరత్వరగా చెప్పేసే సారీకి వులువ లేనట్లే. జీవితంలో సారీ అన్న పదం వాడకుండా గడిచి పోవడం ఒక అదృష్టం ఇది ఎదుటి వారిని ఇచ్చింది. పెట్టని వ్యక్తిత్వం అలవర్చు కొన్న వాళ్ళకి సాధ్యం అవుతుంది. అలా ఉండగలమా అంటే ఒక క్రమ శిక్షణ అలవర్చుకొంటే సాధ్యమైనంత వరకు మనవైపు నుంచి ఎదుటి వాళ్ళని బాధ పెట్టే ఇలాంటి తప్పు చేయకుండా వుంటే …. సారీ ఎందుకు.

Leave a comment