సబ్బు వాడకం కారణంగా, కఠినమైన రసాయినాలకు ఎక్స్ పోజ్  కావడం చేతనో, పొడిగా వుండే వాతావరణం అలాగే ఏజింగ్ ప్రక్రియల వల్ల శరీరం డ్రైగా, డీహైడ్రేడ్ అయిపోతు వుంటుంది. ఎంత నాణ్యమైన బాడీ క్రీమ్స్ వాడిన చర్మం మృదువుగా వుండటం లేదని ఎంతో మంది చెప్పుతుంటారు. అయితే వాడే క్రీముల్లో వుండే రసాయినాలకు చర్మం రఫ్ గా దురదలోస్తూ ఉంటాయి. రెగ్యులర్ గా మాయిశ్చురైజర్ వాడుతున్నా పొడి చర్మం స్పందించడం లేదంటే చర్మం కండీషన్ కారణం అయింది. ముందుగా డెర్మటాలజిస్ట్ ను సంప్రదించి చర్మ సమస్యలు లేవని తెల్చుకున్న తర్వాత చర్మానికి హైడ్రేషన్ కోసం ప్రయత్నాలు చేయాలి. సువాసనలు లేని బాడీ వాష్ లేదా క్లేన్సర్ వాడుతూ సోఅప్స్ మానేయాలి. షియా, కోకోబటర్ గల ఎన్నో రకాల ఉత్పత్తులు పొడి చర్మానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. వీటిని స్నానం చేయగానే చర్మం తడి పొడిగా వున్నప్పుడు వాడితే మంచి ఫలితం వుంటుంది.

Leave a comment