ప్రశాంత జీవనం గురించి మనం ఎంతో మంది ఎక్స్ పర్ట్స్ చెప్పిన సలహాలు వింటూ ఉంటాం. కానీ నగర జీవితంలో ఈ ప్రశాంతంగా శబ్ద కాలుష్యం లేకుండా నిశ్శబ్దంగా హాయిగా ఉండటం ఆసాద్యమే. ఇప్పుడు పరిశోధనలు ఎం చెపుతున్నాయంటే  చుట్టూ రవాణా, ధ్వనులు, పెద్ద పెద్ద శబ్దాలు, ఎప్పుడూ ఏవో చప్పుళ్ళు ఉన్నచోట పెరిగే పిల్లల పైన ఆ శబ్దాలు తీవ్రమైన ప్రభావం చూపుతాయంటున్నారు. అదే పనిగా వినే శబ్దాలు మెదడులో ఒత్తిడి కలిగించే హార్మోన్లను విడుదల చేస్తాయి. దీనిలో పిల్లలలో నిద్రలేమి కనిపిస్తుంది. పిల్లలలో ఒత్తిడి హార్మోన్ల విడుదలలో పిల్లల మెదడులో ఎదుగుదలకు లోపం కనిపించింది. అదే ప్రశాంత వాతావరణం లో పిల్లల మెదడులో హిప్పోకేంపస్ అనే కణాల వృద్ది కనిపించింది. ఇవి పిల్లలలో చురుకుదనం, జ్ఞాపక శక్తిని పెంచుతాయి.

Leave a comment