వేసవి వస్తే స్విమ్మింగ్ ఫూల్స్ గుర్తోస్తాయి. తగిన జాగ్రత్తలు లేకుండా స్విమ్మింగ్ ఫూల్లో దూకితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయం పది తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ముందు స్విమ్మింగ్ చేయకపోవటం మంచిది. స్విమ్మింగ్ తర్వాత స్నానం చేసి తడి లేకుండా తుడుచుకొని సన్ స్క్రీన్ అప్లైయ్ చేయాలి. కంట్లోకి నీరు చేరని కూలింగ్ గ్లాసెస్ వాడాలి. పెదవులు పొడిబారకుండా స్విమ్మింగ్ తర్వాత లిప్ బామ్ అప్లైయ్ చేయాలి. ఫూల్ లో కలిపే నీళ్ళలో క్టోరిన్ వల్ల కళ్ళు మండుతాయి. కనుక వాటర్ గాగుల్స్ పెట్టుకోవాలి. ఈత కొడుతున్న మధ్యలో మంచి నీళ్ళు తాగాలి. స్విమ్మింగ్ ఫూల్స్ లో నీళ్ళు మారుస్తున్నారో లేదో గమనించాలి.

Leave a comment