చర్మం పొడిబారిపోకుండా మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాయాలి. స్నానం చేయగానే చర్మానికి మాయిశ్చరైజర్ రాస్తే పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. ముఖానికి చేతులకు కింద నుంచి పైకిరాయాలి గట్టిగా రుద్దకూడదు లేదా రాసిన చర్మాన్ని పట్టి లాగద్దు. ఇది రాశాక ఫౌండేషన్ క్రీమ్ రాస్తే మేకప్ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, తేనె, వెన్న, కలబంద గుజ్జు, అవకాడో నూనె, పొద్దుతిరుగుడు గింజల నూనె, బాదం నూనె, దోసకాయ గుజ్జు, పెరుగు, రోజ్ వాటర్ వీటిలో ఏదైనా సహజ మాయిశ్చరైజర్ గా ఉపయోగ పడతాయి. దీని వాడకం తో చర్మానికి కాంతి వస్తుంది. వృద్ధాప్య ఛాయలు తలెత్తవు సున్నితమైన చర్మానికి రక్షణ గా నిలుస్తుంది.

 

Leave a comment