సహజమైన ఫేస్ వాష్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. అరకప్పు పాలలో 5 చుక్కల ఆలివ్ ఆయిల్ లేదా సన్ ఫ్లవర్ ఆయిల్ కలిపిన మిశ్రమం రసాయన రహిత క్లెన్సర్ ఈ మిశ్రమాన్ని మెత్తని కాటన్ వస్త్రం పై వేసి ముఖం శుభ్రం చేసుకోవచ్చు. జిడ్డు చర్మం అయితే పావుకప్పు నిమ్మ రసంలో పాలు కలిపి అందులో రెండు స్పూన్ల కీరదోస రసం కలిపి ఆ మిశ్రమంతో మేకప్ తొలగించుకోవచ్చు. అలాగే ఎంజైమ్స్ పుష్కలంగా ఉండే బొప్పాయి గుజ్జు కూడా మంచి క్లెన్సర్.

Leave a comment