అందానికి మేకప్ మెరుగులు మరింత శోభనిస్తాయి. అయితే ఈ దిద్దుకునే ప్రక్రియ పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటే బావుంటుంది. మేకప్ కు ముందు చర్మం సిద్దం చేసుకుంటేనే మచ్చలు లేని సహజసిద్దమైన చర్మపు మెరుపులు వుంటాయి. అందుకే మేకప్ కు ముందు చర్మానికి మేకప్ క్లెన్సింగ్ టోనింగ్ చేస్తే చర్మం మృదువుగా మారి చక్కని మేకప్ కు అనువుగా ఉంటుంది. ప్రతిరోజు సీజన్ తో సంబంధం లేకుండా సన్ స్కిన్ తో మేకప్‌ మొదలు పెడితే వార్దాక్య లక్షణాలు కనపడవు. చర్మం పైన గీతలు,మచ్చలు,ముడతలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు కొద్దిపాటి మేకప్ ముఖానికి మరింత అందాన్నిస్తుంది.

Leave a comment