ముత్యాల నగలు అన్ని రకాల డ్రెస్ లకు మంచి ఆప్షన్. ముందర సహజమైన ముత్యాల్ని కల్చర్ ముత్యాల్ని తేడా ఎలా తెలుసుకోవాలి అంటే జెమ్ ల్యాబోరేటరీ లోనో లేదా మైక్రోస్కోప్ కిందో పరీక్ష చేయాలి. సహజమైన ముత్యాలు చాలా అరుదైన ఆభరణాలు. సైజ్  షేప్ కలర్ ఉపరితలం మెరుపులపై ఆధారపడి ముత్యాలు వెలికడతారు. అత్యంత విలువైన ,ముత్యాలు బాగా వెలుగ్గా ఉండి  మృదువుగా ఉంటాయి. మంచి ముత్యాలు అత్యంత ముఖ్యమైన ప్రమాణం వాటిమెరుపు. దాని వైట్ రిఫ్లెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉపరితలం ఉచ్చులు పట్టి గీతలు  ఎటువంటి లోపం లేకుండా వుంటాయి. సహజమైన ముత్యాన్ని గుర్తించాలంటే పంటిపై రబ్ చేస్తే సహజ ముత్యం గట్టిగా తగిలితే ఆర్టిఫీషియల్ ముత్యం స్మూత్ గా ఉంటుంది. సర్టిఫైడ్ నాణ్యమైన ముత్యాల దండ ఇరవై వేల  రూపాయలుంటే కల్చర్ రకాలు రెండున్నర వేల  రూపాయలు నుంచి దొరుకుతాయి. ఎలాంటి దుస్తులు వేసుకున్న ఒక్క వరస మంచి ముత్యాల దండ  వేసుకున్న క్లాసిక్ లుక్ వస్తుంది.

Leave a comment