ఆకులు , పువ్వులు , మొగ్గలు ,తీగలు గాఢమైన రంగులతో కనిపించే కలంకారీ వస్త్రాలకు ఎప్పుడూ తిరుగులేదు. వేసవికి మళ్ళీ నేత చీరలు వాటిపైన కల్మాకారి ముద్రణలు కొలువు తీరతాయి. కానీ ఈ వస్త్రాలు దారాలు సహజ రంగులతోనే తయారవుతాయి. తెల్లని నూలును వివిధ పరిమాణాల్లో కత్తిరించి బాగా ఉతికి బ్లీచింగ్  చేస్తారు. దాన్ని ఆవు పేడలో నానపెడతారు. వస్త్రంలో ఉన్న జిగురు పోయాక దీనికి కరక్కాయ ద్రావణం అద్దుతారు. దాన్ని పాలలో కలిపినా నీళ్లతో ముంచితే ఆ  వస్త్రం లేత పసుపు రంగులోకి మారి కలంకారీ  అద్దడానికి తయారవుతుంది. రసాయనాలు ఉపయోగించకుండా చెట్ల వేర్లు ఆకులు పువ్వులతో సహజమైన రంగులు తయారుచేస్తారు. ఈ రంగులతో అద్దకం పనిచేస్తారు. కర్ర అచ్చులతో కావలిసిన డిజైన్ అద్ది దాన్ని అత్యంత వేడితో ఉడకనిస్తారు. చీరలు దుప్పట్లు సంచులు చేతి రుమాళ్ళు లుంగీలు టవల్స్ ఏవైన ఇలా తయారుచేసేవే . ఈ కలంకారీ వస్త్రాలకు విదేశాల్లో గొప్ప ఆదరణ వుంది. పచ్చని చిలుకలు అందమైన అమ్మయిలు హంసలు నెమళ్ళు రాజుగారి  ఊరేగింపులు ఈ కలంకారీ కళకు ఎప్పటికీ మార్కెట్ వుంది .

Leave a comment