ఫుడ్ కలర్స్ కలపకుండా సంప్రదాయ పద్దతిలో చేసే బ్రేక్ పాస్టులు వచ్చాయి. పాల కూర,పుదినా లు పేస్ట్ చేసి ఏ వంటకంలో వేసిన ఆ వంట ఆకుపచ్చగా అయిపోతుంది.బీట్ రూట్ గుజ్జు వేస్తే గులాబీ రంగు వస్తుంది. క్యారెట్ లలో నారింజ,ఎరుపు రెండు రకాలుంటాయి కనుక ఇడ్లీ పిండిలో ఈ క్యారెట్ గుజ్జు కలిపితే నారింజ రంగు ఇడ్లీలు వచ్చేస్తాయి. మినపట్టు రవ్వలో ఊతప్పం కూడా అన్ని రకాల కూరల గుజ్జులో కలుపుకొని వర్ణ రంజితమైన దోశలు ప్రత్యక్ష్యం అవుతాయి. ఈ రంగుల టిఫిన్లు పిల్లల కళ్ళను ఆకర్షించేసి వాళ్ళు మారం చేయకుండా ఆరగించేలా చేస్తున్నాయి.

Leave a comment