మాయిశ్చరైజర్ ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అదేంపెద్ద కష్టం కాదు ఇంట్లో ఉండే వస్తువుల తోనే  చెంచా తేనె  అంతే కొబ్బరి నూనె నిమ్మరసం కలిపితే అదే సహజమైన మాయిశ్చరైజర్. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదినిమిషాల ఆటు మృదువుగా రుద్దుతూ ఉండాలి. కాస్సేపటికి కడిగేసుకోవచ్చు. రాత్రిపూట పడుకునే ముందర అప్లయ్ చేసి రాత్రంతా ఉంచుకున్నా పర్లేదు. ఆలాగే పాలు నిమ్మరసం ఆలివ్ ఆయిల్ మిశ్రమం కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. పాలల్లో వుండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఆలివ్ నూనె చర్మాన్ని మెరిపిస్తుంది . నిమ్మరసం మృతకణాలను తొలగించటం తో పాటు మొటిమలు రాకుండా  కాపాడుతుంది.చర్మం మెత్తగా తాజాగా ఉంటుంది. అలాగే ఒక కప్పుడు గులాబీ రెక్కల్ని కప్పు వేడి నీళ్ళల్లో మరిగించాలి. అందులో కొంత రోజ్ వాటర్ చేర్చాలి. ఈ నీళ్లు చల్లారాక నాడులో చెంచా ఆలివ్ ఆయిల్ కలిపి ఫ్రిజ్ లో పెట్టేసుకోవచ్చు . ఈ నీటిని ముఖానికి రాస్తుంటే తేమగా కనిపిస్తుంది. ఇవన్నీ మాయిశ్చరైజర్ లాగే పనిచేస్తాయి.

Leave a comment