ఇంట్లో రోజు చూసే పదార్థాలతో చేసే ఫేస్ పాక్స్ కొన్నీ ఖరీదైన పాక్స్ కంటే బాగా పని చేస్తాయి.ఒక పచ్చి బంగాళాదుంప , ఒక స్ఫూన్ కార్నిఫ్లోర్ ,తేనే తీసుకోవాలి. బంగాళాదుంప తురిమి రసం తీసుకోవాలి.ఆ రసంలో తేనే,కార్నిఫ్లోర్ కలపాలి. దీన్ని మొహానికి ,మెడకు చేతులకు పాక్ గా వేసుకొంటే చాలు. ఇది ఆరిపోయినకొద్దీ స్క్రీన్ టైట్ గా అవటం తెలుస్తూ ఉంటుంది. పావుగంట తర్వాత బాగా ఆరిపోతుంది. అప్పుడు గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి.సెన్సిటివ్ గా ఉంటే చర్మానికి పొడి చర్మానికి ఈ పాక్ వేస్తే మరింత పొడి బారీ పోతుంది.కనుక అప్పుడు కార్న్ ఫ్లోర్ లేకుండా బంగాళాదుంప రసం ,తేనె కలిపి ప్యాక్ వేసుకొంటే చాలు అలాగే క్యారెట్ రసంలో బాధం నూనె కలిపి ముఖానికి రాసుకొని పదిరిమిషాల తర్వాత కడిగేస్తే సరి.ఇది రోజూ రాసిన కుఖంపైన మయ్యలు మరకలు కూడా పోతాయి. మొహాం చక్కని మెరుపుతో ఉంటుంది.
Categories