ఇల్లంతా సువాసనలోస్తే బావుంటుంది. ఎంత ఖరీదైన స్ప్రేలు కొట్టినా కాసేపట్లో మళ్ళి మాములుగానే వుంటుంది. ఈ సారి కొన్ని సహజ సిద్ధమైన పదార్ధాల వైపు చూడండి. నేలను తుడుస్తున్నప్పుడు. నీటిలో రెండు చుక్కలు నిమ్మ గడ్డి నూనె వేస్తె ఈగలు, దోమలు ముసరవు. చక్కని వాసనా వస్తుంది. లేదా గిన్నె నీళ్ళల్లో రెండు స్పూన్లు నిమ్మ గడ్డి నూనె వేసి స్టవ్ పైన పెట్టి మరగానిస్తే ఇల్లంతా సువసనే. అలాగే దాల్చిన చెక్క పొడిని సాంబ్రాని పొగలాగా వేసినా మంచి వాసనే. నిమ్మ చెక్క ఎలాంటి దుర్వాసన అయినా పోగోడుతుంది. రెండు నిమ్మకాయలు పిండి గదిలో స్ప్రే చేస్తే సువసనే. అలాగే నారింజ తొక్కలను నీళ్ళల్లో వేసి మరిగించినా వాసనే. ఇక తాజా పూల పరిమళం గురించి చెప్పనే వద్దు. చామంతి, మల్లె దండలు గదిలో వేలాడదీయండి. చెక్కని సువాసన మనస్సుకి ఆహ్లాదం.

Leave a comment