నా గురించి ఎవరేం అనుకున్నా నాకు అనవసరం. ప్రతి అభిప్రాయాన్ని పుట్టించుకుని దానికి సమాధానాలు ఇస్తూ పొతేనే అంటుంది శృతి హాసన్. మన గురించి ఎవరేం అనుకుంటున్నారు తదేకంగా పట్టించుకునేంత తీరిక ఎక్కడిది. పైగా నాకు ఇలాంటి ఆసక్తి లేదు కుడా.మన తప్పులు మనకి తలియాలి? వీటిని బయట పెట్టుకోవలసిన అవసరం ఏముందీ….వృత్తి పరంగా  నా లోటు పట్లని ఎప్పటికప్పుడు తెలుసుకుని దిద్దుకుంటాను. సామాజిక అనుసంధాన వేదికల ద్వారానే నా అభిప్రాయాలు బయట పెట్టడం నాకు ఇష్టంవుండదు. ఏ సమయంలో నాకు ఏమని అనిపిస్తే అది బయటకు అనేస్తా. అంతా సహజంగా వుండాలి నాకు అంటుంది శ్రుతిహాసస్. తమిళ, హిందీ సినిమాల్లో చాలా బిజీగా వుంది శ్రుతిహాసన్.  శభాష్ నాయుడులో తండ్రి కమల్ హాసస్తో నటించడం గురించి చెప్పుతూ ఆయనో గొప్ప నటుడు ఏదైనా గొప్ప విజన్ వుంటేనే ఆయన దర్శకత్వం చేస్తారు. ఈ సినిమాలో నాది తిరుబాటు భావాలున్న యువతిని అంటూ చెప్పింది శృతి.

Leave a comment