ఈ ఎండలకి టమోటా ఒక టోనర్ లాగా పనిచేస్తుంది జిడ్డుగా ఉండి మొహం మరి ఇబ్బంది పెడుతూ ఉంటే పచ్చి టమాటో రసం ముఖానికి రాసుకుంటే చాలు. అలాగే మొహం ఎండకు కమిలి నల్లబడినట్లు ఉంటే ఒక స్పూన్ టమోటా గుజ్జు, రెండు స్పూన్లు ముల్తానీ మట్టి, టేబుల్ స్పూన్ పుదీనా ఆకుల పేస్ట్ కలిపి ఆయా ప్రదేశాల్లో రాసి ఆరిపోయిన తర్వాత కడిగేస్తే చాలు. నలుపు తగ్గి చర్మం బిగుతుగా అయిపోతుంది. చర్మం మురికి వదలాలన్న మృదువుగా తేమగా అవ్వాలన్న ఒక టమోటా ఒక కీర రసం తీసి వడగట్టి స్ప్రే బాటిల్ లో పోసి ఫ్రిజ్ లో పెట్టాలి. బయటకి వెళ్లేప్పుడు దాన్ని ముఖం పైన చల్లుకొని మాయిశ్చరైజర్ రాస్తే ముఖం తేటగా మెరుపుతో ఉంటుంది.

Leave a comment