వేసవి లో ఇంట్లోనే సజమైన ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకుంటే మేలు అంటున్నారు ఎక్సపర్ట్స్. ఆయిలీ స్కిన్ అయితే అరటి పండు,ఆరెంజ్ మిక్స్ చేసి తేనె కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. తాజా పెరుగు వాటర్ మెలాన్ చర్మానికి రక్షణ ఇస్తాయి. కప్పు పెరుగులో వాటర్ మెలాన్ గుజ్జు కలిపి దీన్ని ప్యాక్ గా వేసుకోవచ్చు. అలాగే పుదీనా పేస్ట్ చేసి ముల్తానీ మట్టి లో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకొంటే చర్మానికి ఎంతో చల్లదనం. రోజ్ వాటర్ మొహాన్ని రిఫ్రెష్ చేస్తుంది. గందం లో రోజ్ వాటర్ కలిపి పేస్టులాగా చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవచ్చు ఈ ప్యాక్ లు మొహానికి తాజాదనం ఇస్తాయి.

Leave a comment