సహజంగా కనిపించడం నాకు ఇష్టం. జీవితంలో ఎఫ్పుడు మేకప్ వేసుకోను, సన్ స్క్రీన్,ఐ లైనర్ వాడతాను అంతే ఈ మధ్య ఒక మ్యాగజైన్ ఫోటో షూట్ కు మేకప్ వేసుకోవల్సి వచ్చింది. సినిమాల్లో డైరక్టర్స్ తప్పదు అంటే మేకప్ వేసుకుంటాను అందం అనేది మనం మనలా ఉన్నప్పుడే వస్తుంది అంటుంది సాయిపల్లవి. నేను తెర పై బాధ పడుతుంటే చూస్తున్న ప్రేక్షకులకు అయ్యే మన అమ్మాయి బాధపడుతుందే అని ఫీలవ్వాలి. ప్రేక్షకులు ఎంతగా నా పాత్రతో కనెక్ట్ అయ్యారనేది ముఖ్యం కాని నేను అందగా కనబడటం కాదు అంటుంది సాయి పల్లవి. భవిష్యత్ ప్లాన్ గురించి అడిగితే నేను ఏది ప్లాన్ చేసుకోని ప్రతిరోజు నూతన ప్రతిభ వెలికి వచ్చే ప్రదేశం సినిమాలే అనుకుంటా అవకాశాలున్నంతకాలం సినిమాలే నా ఆప్షన్ అన్నది సాయిపల్లవి.