Categories

దక్షిణ అమెరికాలోని 22,837 అడుగుల ఎత్తైన మౌంట్ అకాన్‌కాగువా అధిరోహించి ఎత్తైన ఈ శిఖరాన్ని అధిరోహించిన తొలి బాలిక గా రికార్డ్ సృష్టించింది కామ్య కార్తికేయన్. 16 ఏళ్ల కామ్య మౌంట్ కిలిమంజారో పైన త్రివర్ణ పతాకం ఎగరవేసింది. తాజాగా అంటార్కిటిక్ లోని మౌంట్ విన్సన్ ఎక్కి సెవెన్ సమ్మిట్స్ పూర్తిచేసిన యంగెస్ట్ ఫిమేల్ గా రికార్డ్ సృష్టించింది. విశాఖ పట్టణానికి చెందిన కామ్య కార్తికేయన్ లావణ్య ల ముద్దుబిడ్డ పసితనం నుంచి తల్లిదండ్రుల భుజాలపై ఎక్కి ట్రెక్కింగ్ అనుభవాలు చూసిన కామ్య మూడేళ్ల వయసులోనే లోనవాలలో తండ్రి తో పాటు ట్రెక్కింగ్ లో పాల్గొని శభాష్ అనిపించుకుంది.