ఈ రోజు మన ఇష్టమైన దేవునికి పూజ చేసికొన వచ్చును. సాయిబాబాకి కూడా ఈ రోజు చాలా ఇష్టం. ఎవరికి ఏ దేవుడు ఇలవేల్పు అయితే ఆ దేవుడిని పూజిస్తారు. లక్ష్మి వారం నాడే ఇంటిని నలుమూలల శుభ్రంగా చేసుకోవాలి. ఈ రోజు కొంతమంది ఉపవాసం ఉంటారు. ఎవరు ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టి తాంబూలం ఇస్తే సకల దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ కాపాడుతాయి. భక్తులు తమ మనసు లో ఉన్న ది క్రియా రూపంలో చేయాలి.దుర్గాదేవి కి కూడా ప్రీతి కరమైన రోజు.సాయంత్రం శాయి నిష్ఠాపరులు భజనలు చేసి స్వామి వారి కటాక్షం పొందుతారు.ఈ రోజు అన్నదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
ఇష్టమైన పూలు:సకల దేవతలకి అన్ని రకాల పుష్పాలు అంగీకారమే.
ఇష్టమైన పూజలు: సాయిబాబా కి భజనలు,హారతులు
దుర్గా దేవికి:నిమ్మకాయల దండ తో పూజ చాలా ఇష్టం.
నిత్య ప్రసాదం: కొబ్బరి,లడ్డు,పండ్లు

లడ్డు తయారీ: శనగపండి, పంచదార, జీడిపప్పు,కిస్మిస్,యాలకుపొడి.   ముందుగా శనగపిండిని నీరు పోసి బజ్జీల పిండి లాగా తయారు చేసి జల్లి గరిటెతో బూంది లాగా నూనె లో తిప్పుతూ, చల్లారిన తర్వాత పంచదార వేసి, జీడి పప్పు,కిస్మిస్,యాలకుపొడితో నైవేద్యం పెట్టి
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని మనస్పూర్తిగా నమస్కరించు కుందామా!!

    -తోలేటి వెంకట శిరీష  

Leave a comment