Categories
WoW

సైక్లింగ్ తో వత్తిడి మాయం.

సైక్లింగ్ చేయడం వల్ల వత్తిడి తగ్గిపోతుందని తాజా పరిశోధనలు చెప్పుతున్నాయి. సైకిల్ తొక్కడం వల్ల శరీరానికి ఆరోగ్యం అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ పరిశోధనలు వత్తిడి తగ్గించుకునే సైక్లింగే అంటున్నాయి. 143 మంది ఐ.టి ఉద్యోగుల పైన దీర్ఘ కాలపు అధ్యాయినం నిర్వహించారు. వారందరూ కార్లు, బస్సులు, టూ వీలర్ల పైన ఆఫీసు కు వెళ్ళేవారు. ఆఫీసు కు చేరుకున్న మొదటి 47 నిమిషాలలో వీరి మానసిక స్ధితి ఆలోచన సరళి, ఆరోగ్యం అంచనా వేశారు. అలాగే సైకిల్ పైన వెళ్లి తమ పనులు చేసుకునే చిరు ఉద్యోగుల గురించి అధ్యాయినం జరిగింది. సైకిల్ పైన వెళ్లి తమ పనులు చేసుకునే చిరు ఉద్యోగుల గురించి అధ్యాయినం జరిగింది. సైకిల్ పైన పనులు చేసే వాళ్ళలో చురుకుదనం ఎప్పుడూ ఒకే లా వుంది. సాయంత్రం వేల ఒక టైం ప్రకారం సైక్లింగ్ చేసే వారి కంటే సైకిల్ పైన ప్రయాణంలో మానసిక ప్రశాంతత అద్భుతంగా ఉంటుందని, పర్యావరణ హితమైన సైకిల్ ప్రయాణాన్ని ప్రారంభించమని అధ్యాయినకారులు సలహా ఇచ్చారు.

Leave a comment