సాధారణంగా మన కేఫ్ లు చాల సందడిగా ఉంటాయి. కబుర్లు, కాఫీ లు కలిపి పంచుకొంటారు . కానీ చైనాలో ఉన్నా ఈ స్టార్ బక్స్ కేఫ్ లో మాటలు అసలు ఉండవు . ఏం ఆర్డర్ చేయాలన్నా సైలెంట్ గా నంబర్స్ చూపించటమో ,కాగితం పైన రాసి ఇవ్వటమో చేయాలి . ఎందుకంటే ఇదో ప్రత్యేకమైన కేఫ్ . కేవలం బాధితులే పని చేస్తారు . వారి ముందు మాట్లాడి వారి లోపాన్ని ఎత్తి చూప కూడదానే ఉద్దేశ్యంతో యాజమాన్యం ఈ ఏర్పాటు చేసింది . స్టార్ బక్స్ దివ్యాంగుల కోసం సృష్టించి ఇచ్చిన ఈ ఆలోచన ప్రపంచానికి ఒక కుదుపు తెచ్చింది . ఈ సైలెంట్ కేఫ్ ని వెంటనే ప్రజలందరూ ఆదరించారు . ఈ కేఫ్ లో కాస్సేపు కూర్చొని ఒక కప్పు కాఫీ తాగితే ఎంతో ఒత్తిడి తగ్గిపోయి నట్లు ఫీలవుతారు కూడా .

Leave a comment