ఎంతో మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడి పోతుంది కొన్ని సహజమైన పరిష్కార మార్గాలు చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు. మూడు నాలుగు ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కోసి కప్పు నీటిలో చిన్న మంటపైన మరగించాలి 15 నిమిషాలు మరిగాక ఆ నీటి ని చల్లార్చి స్ప్రే బాటిల్లో పోసి ఫ్రిజ్ లో ఉంచుకోవాలి తలస్నానం తర్వాత జుట్టు ఆరాక ఈ నీళ్ళు స్ప్రే చేయాలి. తలకు పట్టేలా మృదువుగా మర్దన చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే ఫలితం తెలుస్తుంది. గుంటగలగరాకు సహజమైన డై లా పనిచేస్తుంది. దీని లోని బయో ఆక్సిస్ గుణాలు మెలనిన్ ను పెంచుతాయి. కప్పు నూనె కు సమానమైన పరిమాణంలో ఆకులు కలిపి వేడి చేయాలి బాగా కాచి చల్లార్చిన ఆ నూనెతో వారానికి రెండు సార్లు జుట్టును మృదువుగా మర్దన చేయాలి. శిరోజాలు నల్లగా అవుతాయి.
Categories