బార్లీ అంటే అదేదో అనారోగ్య ఔషధంలా మొహం పెడతారు. కాని బార్లీ ఎంతో శక్తినిచ్చేది, త్వరగా అరిగిపోయే ఆహారం కూడా. ఇది లో ఫ్యాటీ డైట్ గా చెపుతారు డిటీషియన్స్. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ప్రీ డయాబెటిక్ స్థాయికి వెళ్లిన గ్లూకోజ్ నిల్వలను సాధారణ స్థాయికి తీసుకురాగలుగుతుంది. మధుమేహంతో బాధపడే వాళ్ళు బార్లీని ఆహారంలో తీసుకోమంటారు డాక్టర్లు. బార్లీలో ఉండే ప్రత్యేకమైన పీచు పదార్ధం బార్లీని శుద్ది చేసినా అలగే ఉంటుంది. బార్లీ జావలో కూరగాయల ముక్కలు కలిపి తీసుకోవచ్చు, ఏదో రకంగా బార్లీని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరానికి శక్తి సమకూరుతుందని చెపుతున్నారు.

Leave a comment