ఖరీదైన జీడిపప్పు లో లాగే వేరుసేనగాలలో కూడా ఎన్నో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ వున్తాయంటున్నారు  డైటీషియన్లు. వేరు సేనగాలలో ప్రోటీన్స్ ఎక్కువ. వందగ్రాముల గింజల్లో 567 క్యాలరీల శక్తి 25.8 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి.ఇవి శక్తిని ఇస్తాయి. గాయాలు మాన్పుతాయి. వీటిల్లో కార్బోహైడ్రేడ్లు 13,16 శాతం మాత్రమే వందగ్రాముల్లో 16.1 గ్రాముల పిండి పదార్ధాలు ఉంటాయి. అందుకే డయాబెటిస్ రోగులు కూడా చిరుతిండిగా వేరుసేనగలు తినొచ్చు. 100 గ్రాముల్లో 49.2 గ్రాముల కొవ్వులే వాటిలో మోనో అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు 24.43 గ్రాములు పాలీ అన్ శాచ్యురేటెడ్ కొవ్వులో 6-28 గ్రాములు. కాబట్టి ఇవి ప్రధానమైన శక్తి వనరులు. గర్భవతులకు మంచి మేలు చేస్తాయి. ఇందులో వుండే ఎన్నో ఖనిజాలతో మంచి రోగ నిరోధక శక్తి లభిస్తుంది.

Leave a comment