పాలకూర కాస్త వేయించి పెరుగులో కీరముక్కలు , నిమ్మరసం కొత్తి మీరతో ఈ పాలకూర కలిపిన దైతే  ఇక ఈ వేసవి వెళ్ళే వరకు భోజనంలో భాగంగా ,సలాడ్ లాగా కానీ, బిరియాని, పరోటాలతో గాని తింటే బోలెడన్ని పోషకాలు అందుతాయి. ముఖ్యంగా గర్భీణీ స్త్రీలకు రక్తహీనత నివారిస్తుంది.  తక్కువ కాలరీలు ఉంటాయి కనుక బరువు తగ్గలనుకొనేవాళ్ళు ఎక్కువ  తిన్న పర్లేదు. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు శారీరక శ్రమ చేసే పెద్దవాళ్లకు కూడా ప్రయోజనం. ఇది అధిక రక్త పోటు తగ్గిస్తుంది. అధిక మోతాదులో యాంటీఆక్సిడెంట్లు ,సూక్ష్మపోషకాలైన విటమిన్ ‘సి’ విటమిన్ ‘కె’ లు,కాల్షియం , ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

Leave a comment