శక్తిని ఇచ్చే చిన్న కునుకు అంటే పవర్ నాప్ లో పది నిమిషాలు పడుకుకొని లేవటమన్నమాట. దీనితో శరీరం మనసు రెండూ సేదా తీరుతాయి అంటున్నారు అధ్యయనకారులు. ఈ పవర్ న్యాప్ వల్ల వ్యక్తుల్లో పని చేసే సామార్థ్యం పెరుగుతుందట. కొద్దీ నిమిషాల నిద్ర జ్ఞాపక శక్తిని ఉత్తేజితం చేస్తుంది. మనం పగలు చేసే పనిలో ఉన్న ఒత్తిడిని తగ్గించి నిర్ణయాలు తీసుకొనే శక్తిని పెంచుతుందంటున్నారు. ఇలా చేయటం వల్ల శరీరానికి అవసరమైన విశ్రాంతి లభిస్తుంది. శరీరం రీచార్జ్ అవుతుంది. చిన్న తనం లో తల్లులు ,పిల్లల్నీ కాసేపు పడుకొమని ప్రోత్సాహించటం వంటిదే ఈచిన్న నిద్ర. ఒక వేళ రాత్రి వేళ ,పార్టీనో ,మిత్రుల పెళ్ళినో ఎంజాయ్ చేయలంటే కాస్త కునుకు తీయటం మంచిదే.

Leave a comment