సలాడ్ కేక్ రూపంలో అందంగా తయారు చేసి ప్రపంచం ముందుకు తెచ్చింది జపాన్. కీరా,క్యారెట్ ఉల్లిపాయ క్యాబేజీ తరుగు ఉప్పు మిరియాల పొడి వేసి సలాడ్ తయారు చేస్తారు. కానీ దాన్ని కేక్ లాగా చేసుకోవచ్చు. ఇందుకు కావలసింది . గట్టి పెరుగు క్రీమ్ రకరకాల కాయగూరలు తురుము కేక్ టిన్నులో వరసగా రకరకాల కూరగాయల ముక్కల్ని సన్నగా తరిగి పొరలు పొరలుగా పరుస్తూ మధ్య మధ్యలో పెరుగు మీగడ పరిచి ఆ పాత్రను ఫ్రీజ్ లో నాలుగైదు గంటల పాటు పెట్టేస్తే సరి. పెరుగు మీగడ కూరగాయ ముక్కల్ని గట్టిగా చేసేస్తాయి. తినే ముందు ఫ్రిజ్ లోంచి తీసి ఈ పెరుగు సలాడ్ కేక్ ని చక్కగా ముక్కలుగా కోసి తినచ్చు. ఈ సలాడ్ కేక్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

Leave a comment