అందరికీ అన్ని రకాల లిప్ స్టిక్ లు అందం ఇవ్వవు .చర్మం రంగును బట్టి లిప్ స్టిక్ ఎంచుకోవాలి. ఇప్పుడు చర్మం రంగు చాలా తెల్లగా ఉంటే బర్గండీ కలర్ ఇవ్వాల్టి ఫ్యాషన్ కలర్ . ఇది కొంచెం డార్క్ అనిపించినా పర్లేదు. పూర్తి అప్లికేషన్ కాకుండా బర్గండీ స్టెయిన్ వాడితే ఫేయిర్ కాంప్లెక్షన్ కు కాస్త స్ట్రాంగ్ గా ఉంటుంది. కొంచెం తేలికగా అద్దేస్తే సరిపోతుంది. కొత్తగా ఇంట్లో మేకప్ మొదలుపెట్టే అమ్మాయిలు ముందుగా ఎక్స్ పర్ట్స్ సలహాపైన మేకప్ సామాగ్రి ,ఫేస్ కలర్ కు సూటయ్యే లిప్ స్టిక్ అలాగే మొహం తీరును బట్టి మ్యాచ్ అయ్యే హెయిర్ స్టైల్ ,జుట్టు ఏవిధంగా దువ్వుకొంటే బావుంటుందో సలహ తీసుకోవాలి.

Leave a comment