లాల్,అసిఫ్ అలీ, స్వేతా మీనన్,మైథిలి నటించిన సాల్ట్ అండ్ పెప్పర్ ఇద్దరు జంటల ప్రేమకథ. ఆర్కియాలజిస్ట్ కాళిదాసన్ కు మాయ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ దోసెలు ఆర్డర్ ఇస్తూ ఫోన్ చేస్తుంది. తరువాత తను రాంగ్ నంబర్ కు కాల్ చేశానని తెలుసుకొంటుంది. కాళిదాసన్ మాయా కలుసుకోకుండానే మాట్లాడుకొంటూ ఇద్దరు భోజన ప్రియులే అని తేల్చుకొంటారు. ఇద్దరు కలుసుకోవాలనుకొంటారు. కానీ మొహమాటం తో కాళిదాసన్ మేనల్లుడు మను మయా ఫ్రెండ్ మీనాక్షిని తమకు బదులుగా కలుసుకొనేలాచేస్తారు. మను ,మీనాక్షి కలుసుకొంటారు. అసలు కధ ఇక్కడే మొదలయింది. ఎన్నో అపార్ధాలు మానస్థాపాల తరువాత రెండు జంటలు ఏకం అవుతాయి. ప్రకాష్ రాజ్ ఈ సినిమాను ఒకే సారి తెలుగు కన్నడ భాషల్లో నిర్మించారు అన్ని భాషల్లోనూ ఈ సినిమా విజయవంతం అయింది. ఈ సినిమా ప్రైమ్ లో చూడచ్చు.

రవిచంద్ర.సి 
7093440630

 

Leave a comment