107 సంవత్సరాల తిమ్మక్క కర్ణాటక లో ని తుమకూరు జిల్లా దుగ్గి లో పుట్టి పెరిగారు. క్వారి లో కూలిగా పనిచేసే బక్కయ్యని పెళ్ళాడారు. వారికి పిళ్ళలు లేరు.బెంగుళురు రూరల్ జిల్లా హలికల్ లో నివసించే ఈ దంపతులు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. హలికల్ నుంచి కూడురు వరకు రహదారి పక్కన 384 మర్రి చెట్లను నాటి వాటికి నీళ్ళు పోసి పెంచారు. దీని కోసం కృషి చేసిన తిమ్మక్క కు కేంద్ర ప్రభుత్వం భారత జాతీయా పౌర పురస్కారంతో సత్కరించింది. ప్రస్తూతం ఈ వయస్సు లోను వాన నీటీని భద్ర పరిచే ట్యాంఖ్ నిర్మాణం పనులలో బిజీ గా ఉన్నారు తిమ్మక్క . చెట్లను ఒక వరుసలో రహదారి పోడుగున నాటడాన్ని సాలు అని అర్ధం. సాలు మరద తిమ్మక్క అంటే కన్నడ లో చేట్ల వరుస అని అర్ధం . పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన తిమ్మక్క ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది ప్రభుత్వం.