కోవిడ్ సంక్షోభం లో ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి ఉద్యోగ విధులు నిర్వహించారు ఆశా వర్కర్స్ వాళ్లలో ఒక గుజరాత్ లోని వాజీపూర్‌ కు చెందిన లక్ష్మి వాఘేలా అక్రిడేటెడ్‌ సోషల్‌ హెల్త్‌ యాక్టివిస్ట్‌. ఇద్దరు బిడ్డల తల్లి అయిన లక్ష్మి వాఘేలా కోవిడ్ సమయంలో ఉదయం ఐదు గంటలకే విధులు నిర్వహించేందుకు బయలుదేరేది. ఉద్యోగం కంటే బతికి ఉండటం ముఖ్యం కదా అని ఇంట్లో అందరూ వాదించారు కానీ లక్ష్మికి తాను చేస్తున్నది ఉద్యోగం అనిపించే లేదు. సమాజసేవలో భాగం అనిపించింది. వ్యాక్సినేషన్ సమాచారానికి సంబంధించి డోర్ టు డోర్ సర్వీస్ లు, కాంటాక్ట్ ట్రేసింగ్, మందులు సరఫరా వంటివి అలుపెరగకుండా చేసింది లక్ష్మీ వాఘేలా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ఆశా వర్కర్స్ కు గ్లోబల్ హెల్త్ లీడర్స్ పురస్కారం ప్రకటించింది.

Leave a comment