సంగీతం, పెయింటింగ్, కళలంటే మాకు చాలా ఇష్టం అంటారు కదా అయితే మీలో ఇంకో మంచి గుణం  కుడా వుంటుంది. మనస్సు ను గాలించండి అంటున్నాయి అద్యాయినాలు. కళల పట్ల ఆసక్తి వున్న వాళ్ళకి సామాజిక కార్యకలాపాల పట్ల సానుకూల దృక్పదం, సహనం ఉంటాయంటున్నాయి అద్యాయినాలు. రక్తదానం, డబ్బు విరాళంగా ఇవ్వడం, ఇరుగు పొరుగులకి సహకరించడం నిజాయితీగా వుండటం మొదలైన గుణాలు అంతర్గతంగా ఉంటాయిట. కళలను ప్రేమించే యువతరంలో సామాజిక బాధ్యతలు ఎక్కువగా కనిపించినట్లు అద్యాయినకారులు గుర్తించారు. నిజమే, కళలు మనస్సుని విశాలం చేస్తాయి ఇతరుఅల కష్టానికి స్పందించే నిజాయితీ గల మనసు కళాకారులను ప్రేమించే వాళ్ళలోనే వుంటుంది.

Leave a comment