చిన్ని చిన్ని కానుకలతో అమ్మాయిలను ఇంప్రస్ చేయాలనుకొంటారు అబ్బాయిలు . అయితే నేనెప్పుడూ ఇలాంటి బహుమానాలకు పడిపోను . ఇవ్వాళ చాలామంది నాలాంటి అమ్మాయిలే . కెరీర్ విషయంలో తప్పించి ఇంకేం ఆలోచించరు అచ్చం నాలాగే అంటోంది  రశ్మిక మందన్న . అసలు మనతో  స్నేహంగా ఉండాలను కొనేవాళ్ళులో గొప్ప లక్షణాలు అక్కర్లేదు నిజాయితీ ఉంటేచాలు . ఎవరైనా అలా మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళను ఏ అమ్మాయి లైనా ఇష్టపడతారు . నేనైతే అంతే నిజాయితీగా ప్రోఫిషనల్ గా ,నన్ను కాస్త భరించేలా ఉంటే నేనెవరితో నైనా  స్నేహం గా ఉండగలనని  నేననుకుంటాను . ఇవ్వాల్టి అమ్మాయిలకు సరిగ్గా తమతో సమానంగా అడుగులు వేసేవాళ్ళంటేనే ఇష్టం . ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమా పాత్రలన్నీ అలాగే ఉన్నాయి . ఆత్మగౌరవం నిండిన అమ్మాయి పాత్రలు మా అమ్మాయిలం ఏం కోరుకొంటాం ఇంతకంటే అంటోంది రశ్మిక .

Leave a comment