నీహారికా,

కరక్టే ఈ ప్రాబ్లం కేవలం ఉద్యోగం చేసే ఆడవాళ్ళకే, ఇంటికీ, ఆఫీస్ కీ సరైన న్యాయం చేయలేక పోతున్నామని బాధపడేది స్త్రీలే. ఎందుకంటే వాళ్ళకే ఇంటి బాధ్యత, ఆఫీస్ బాధ్యత సమానంగా వుండేది. మారాల్సింది వీళ్ళే ఆఫీసులో పూర్తి కాని పనుల, మరునాడు చేయవలసిన పనుల గురించి ఇంటికొచ్చి ఆలోచించడం వల్ల ఎలా ప్రయోజనం ఉండదో, ఆఫీసులో వుండి, పిల్లలకు ఇంటికి న్యాయం చేయలేకపోతున్నానని గిల్టీగా ఫీల్ అవ్వడం వల్ల లాభం అంతే, అనవసరమైన ఆలోచనలతో మనస్సు పాడు చేసుకోవడం తప్ప లాభం వుండదు. ఉద్యోగ వత్తిడి, పని, కెరీర్ తో సహజంగా ఉంటేనే వాటిని వీలైనంత వరకు ఇంటి దాకా తీసుకురావడం, బాధపదతంతో వ్యక్తిగత జీవితాన్ని కస్తాపెట్టుకోవడం తప్పా ఎం చేయగలరు. ఇల్లు, ఆఫీస్ కు వెళ్లి ఇంటి గురించి ఆలోచించడం మానేసి రెంటినీ సమన్వయం చేసుకునేలా పనుల జాబితా సిద్దం చేసుకోవాలి. ఒక్కోసారి పనులు అటూ ఇటూ కావచ్చు దాని గురించి బెంబేలు పడటం దండగే. ఇంట్లో అయినా, జాబ్ లో అయినా ఆ మేరకు సాగిపోతుండాలి. ఈ పరిస్థితిని సమర్దవంతంగా ఎదుర్కోవడానికి కావాల్సింది సమయపాలన. టైమ్ ని గుప్పిట్లో పెట్టుకోవాలి. దేని టైమ్ కి దాని పని అయిపోవాలి. వర్తమానంలో మమేకం అయ్యేలా మెదడుకు శిక్షణ ఇచ్చుకోవాలి.

Leave a comment