నెలసరి సమస్యలు చాలా మందిలో ఉంటాయి. ప్రతి చిన్ని విషయానికి మందుల జోలికి పోకుండా సహజంగా తగ్గి పోయేందుకు ఇంటి వైద్యం ఉపయోగ పడుతుంది. నువ్వులకు హార్మోన్లు క్రమబద్దీకరించే గుణం వుంటుంది. నువ్వులు బెల్లం కలిపి నెలసరి వచ్చే ముందు ఒక వరం రోజులు క్రమం తప్పకుండా తింటే రక్త హీనత లేకుండా వుంటుంది. కాల్షియం కుడా చక్కగా అందుతుంది. రోజు ఉదయం బొప్పాయి ముక్కలు తింటూ వున్నా ఫలితం వుంటుంది. వేడి పాలల్లో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే మంచిది. పండ్ల రసాలు, హెర్బల్ టీ, చెరకు రసం మంచివే అలాగే వ్యాయామాలు కూడా చాలా అవసరం.

Leave a comment