సీసాల్ట్ ట్రీట్ మెంట్ తో జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు డాక్టర్స్. జుట్టుకు సంబందించిన సమస్యలు తీవ్రంగా వుంటే ఉప్పు కలిపిన షాంపూ వాడి చూడండి అంటున్నారు. సముద్రపు ఉప్పు జుట్టు పెరుగుదలకు సాయం చేస్తుంది. తలస్నానం అయ్యాక ఒక స్పూన్ సీ సాల్ట్ తో మాడు పై పది నిమిషాలు మర్దనా చేయాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. ఉప్పు పూర్తిగా పోఎలాగా జుట్టు బాగా కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు తేడా తెలుస్తుంది అంటున్నారు. సెటేషియన్ గ్రంధుల స్రావం కారణంగా మాడు, జుట్టు పైన జిడ్డుగా అనిపిస్తే జుట్టును చక్కగా విడదీస్తూ ఉప్పు చల్లుతూ వాడాలి. కాసేపు ఆగి తలస్నానం చేస్తే జుట్టు పొడిగా మెరుస్తూ వుంటుంది.

Leave a comment