డైట్ చార్ట్ ని చుసుకుంటూనే తింటున్నాను. అన్నం మానేసాను సెరల్స్ తీసుకుంటున్నాను అయినా ఇలా బరువు పెరిగి పోతున్నాను అని వాపోయే వాళ్ళు చాలామంది. అయితే అధ్యాయినాలు ఏమంటున్నాయంటే లోపల వత్తిడి పెరిగి పోతుందేమో గమనించుకోండి. దీర్ఘకాలిక ఒత్తిడి తో ఇబ్బంది పడే వారికి స్థూలకాయం అవకాశాలు ఎక్కువే  అంటున్నాయి. నెలల తరబడి కార్టీసోల్ స్ధాయిలు అధికంగా వుంటే మరింతగా బరువు పెరిగిపోతారు. ఈ వత్తిడి లో ఎదో ఒక్కటి తినేస్తారు. ఎక్కువ ఫ్యాట్ చక్కెరలు క్యాలరీలు వున్న పదార్ధాలు తినడం ఒత్తిడి లో వున్నప్పుడు సౌకర్యంగా వుంటుంది. స్ట్రెస్ హార్మోన్, కార్టేసోల్, జీవక్రియల్లో కొవ్వు ఎక్కడ నిల్వ వుంటుందో నిర్ణయించడంలో కీలకం. అంచేత బరువు పెరిగిపోతున్నామని బాధపడే కంటే ముందు ఒత్తిడి తగ్గించుకోండి అంటున్నాయి అధ్యాయినాలు.

Leave a comment