ఎప్పుడో పాతకాలంలో పులిగోరు గోలుసులోచ్చేవి. అవే విచిత్రం అనుకుంటే, మేకలు, గొర్రెలు, పులులు, సింహాలు, చేపలు,  పిల్లులు, మొసళ్ళు, బల్లులు అన్నీ ఇన్నీ జంతువులు కావు. ప్రక్రుతి లో వుండే పురుగు పుట్రా కూడా పెండెంట్స్ రూపంలో ఇప్పుడు మార్కెట్లో ఫ్యాషన్. ఈ జ్యూవెలరీ పెండెంట్స్ బంగారు, వెండి, ప్లాటినం మిక్సడ్ మెటల్స్ తో అందుబాటు ధరల్లోనే వున్నాయి. ప్రత్యేక డిజైన్లను బట్టి వీటి విలువ పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో వున్న ఈ విచిత్రమైన పెండెంట్స్ ఓ సారి ఇమేజస్ లో చూడండి. సీతాకోక చిలుకలు, నెమళ్ళు, హంసలతో పాటు పిల్లులు, గుర్రాలు, ఏనుగులు, గొర్రెలు యువత మనస్సుని దోచుకుని వాళ్ళ మెడలో చూటు చేసుకుంటుంన్నాయి అంటే ఫ్యాషన్కు అర్ధం ఇప్పుడేమని చెప్పాలి. అన్నట్లు ముళ్ళ పంది, పాము, తాబేలు వున్నాయి చూడండి ఓ సారి.

Leave a comment