సమతా మూర్తి రామానుజుల వారి 216 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. కూర్చొని ఉన్న విగ్రహాలలో ఇంతకన్నా పెద్ద విగ్రహం థాయిలాండ్ లోని గౌతమ బుద్ధుని విగ్రహం ఒక్కటే 1140 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది ఆ విగ్రహం. రామానుజుని విగ్రహం ఒక్కటే కాదు కింద ఉన్న విశాల ప్రాంగణంలో మొత్తం 108 దివ్య క్షేత్రాలు నిర్మించారు ఇవన్నీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాల ప్రతిరూపాలు ఈ దివ్య క్షేత్రాలు, అందులోని ఫౌంటెన్స్ ఒక్కోటి 30 అడుగులు విశాలమైన ప్రాంగణం 54 ఎకరాల విస్తీర్ణం చుట్టు 334 ఎకరాల ప్రదేశం ఈ సమతా స్థలం కిందికే వస్తుంది.

Leave a comment