నీహారికా,

ఒక వయసు అమ్మాయిలకో చిన్ని సలహా ఇవ్వాలని చాలా  గట్టిగా అనిపిస్తోంది. చదువు పూర్తి కాగానే క్యాంపస్ఉద్యోగాలు వస్తున్నాయి. అప్పటి వరకు సోషల్ మీడియాలో సేల్ఫీలు, మెసేజ్ లతో బిజీగా ఉండే అమ్మాయిలూ అన్నీ పక్కన పెట్టి ఉద్యోగం పైన దృష్టి పెట్టాలి. కానీ అలవాటైన సరదాగా ఊరుకోనివ్వదు. అందుకే కొత్తగా లైఫ్ ని ప్లాన్ చేసుకోవాలి. మరి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాక కొత్త అలవాట్లు చేసుకోవాలి కదా. పేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లకు కొంత సమయం కేటాయించి వాటిని సరిగ్గా ఆ సమయంలోనే ఓపెన్ చేయాలి. అత్యవసర మెయిల్స్ అనుకొన్న సరే టైం కి కట్టు బడాలి. ఉద్యోగం వ్యక్తి గతమైన పనులు దొరికే కాస్త సమయంలో చేయాల్సిన పనులు దొరికే  కాస్త సమయంలో చేయాల్సిన పనులు ఇవన్ని లిస్టు గా రాసుకొని అందులో యాత్రికంగా చేయాల్సిన పనులు వదిలి కాస్త మనసు పెట్టి ఛీ పనుల ముందు వరుసలో రాసుకోవాలి. సాధారణంగా ఉద్యోగం జీతం ఫస్ట్ ప్రయారిటీ కనుక అవే ముందుంటాయి. ఇక తర్వాత వరసాగా చేసే పనులు, సోషల్ మీడియాకు కూడా కొంత సమయం వెచ్చిస్తే ఉదయం నిద్రలేవకపోవాటం రెండో సారి అనుభవం లోకి వచ్చాక నెమ్మదిగా పద్దతికి అలవాటు పడొచ్చు. ఏమంటావు నీహారిక!

Leave a comment