ఉద్యోగం చేసే అమ్మయిలకు ఫిట్ నెస్ కోసం దొరికే సమయమే ఉండదు. అయితే ఆ వర్కవుట్స్ కు కేటాయించే సమయం మాట ఆలా ఉంచి, వాళ్ళ ఆహార ప్రణాళికలోనే బరువును పెంచే అంశాలున్నాయంటున్నారు డైటీషియన్లు . అన్నింటికంటే ముందుగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఎగొట్టి ఆఫీసుకు పరుగు దీయాలా; దానితో లంచ్ లో తినే ఆహారం ఎక్కువ మొత్తంలో ఉండటం జరుగుతోంది. వర్క్ టెన్షన్ కొద్దీ ఎన్నో కప్పుల కాఫీ,టి లు లాగిస్తారు కాఫీ షాప్ లో సర్వే చేస్తే కాఫీల్లో షుగర్ ఎక్కువే. ఆన్ లైన్ లోను లేదా ఆఫీస్ లో ఇచ్చే కార్పోరేట్ లంచ్ తోనే భోజనం చేసేవాళ్ళు ఎందరో. క్యాలరీలు ఎక్కువగా వుండే ఈ లంచ్ లో ఆరోగ్యం దెబ్బతీస్తాయి. రాత్రి వేళ,ఇంటికి వస్తూనే ఎ టివి ముందో ఫోన్ తోనో కాలక్షేపం చేయటం బయటి ఫుడ్ తినటం ఇంకో అనారోగ్య లక్షణం. సరైన డైట్ ప్లాన్ లేకపోతే శరీరం కదల్చక,బయటి ఫుడ్ తోను ఊబకాయం రావటం ఖాయం.

Leave a comment