ఒక గొప్ప పని చేసేందుకు గొప్ప వాళ్ళు అయి ఉండక్కర్లేదు. మామూలు మనుషులు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు,సాధిస్తారు. పశ్చిమబెంగాల్ కు చెందిన 36 సంవత్సరాల మీనాగయేన్ సుందర్ఖన్స్ డెల్టా సమీపంలోని గిరిజన గ్రామాలు కలుపుతూ ఒక రహదారి నిర్మించటంలో ప్రధాన పాత్ర పోషించింది. పరగనా జిల్లాకు చెందిన సఫర్ జంగ్ గ్రామ పంచాయితీకి రహదారి లేదు. దీనితో సమిష్టిగా కృషి చేస్తే గ్రామానికి రహదారుల సౌకర్యం సమీప గ్రామాలతో కలిసే అవకాశం అన్ని ఉంటాయి. అవగాహన కల్పించటంలో మహిళలంతా ఒకటై రహదారి నిర్మించారు. ఒక ఎన్జీవో నుంచి ఇటుకలు అందేలా చేసేంది మీనా. 10 కిలో మీటర్ల పొడుగు 15 అడుగుల వెడల్పు తో రహదారి నిర్మిస్తే అది 20 గ్రామాలను కలిపే 18 మార్గాలుగా తయారైంది. ఇప్పుడు గిరిజన గ్రామాలన్ని ఈ రహదారి తో కలుపుకొనే అవకాశం కుదిరింది.

Leave a comment