భారత బయో టెక్నాలజీ రంగంలో కిరణ్ మజుందార్ షా ఒక వెలుగు కిరణం. ఆమె సాధించిన విజయాలు అందరికీ తెలిసినవే. పద్మశ్రీ పద్మ భూషణ్ అవార్డులు గ్రహించిన కిరణ్ తన ఆస్తి లో సగ భాగం పూర్తిగా ఆపన్నులకు ఆదుకోవటం కోసమే కేటాయించారు. సంపన్న భారతీయుల జాబితా లో నాలుగో స్థానంలో ఉన్న ఆమె మారుమూల గ్రామాల్లో ప్రజల సత్వర సేవల కోసం 220 కోట్లతో ఇరాజ్ రోగ నిర్ధారణ కేంద్రం నిర్వహిస్తున్నారు. బెంగుళూరు లో 1400 కోట్లలతో కాన్సర్ ఆసుపత్రి నిర్మించారు. వరద బాధితుల కోసం 3000 ఇల్లు కట్టించారు, నాన్ ప్రాఫిట్ ట్రస్ట్ లో సభ్యులుగా ప్రోత్సాహకులుగా ఉన్నారు. అద్దె ఇంట్లో ప్రారంభించిన బయోకాన్ ప్రాజెకక్ట్  ఈ రోజు అతి పెద్ద సంస్థగా అవతరించిందంటే కిరణ్ మజుందార్ షా సంకల్ప బలం. ఆమె వితరణ ప్రపంచంలో అవసరంలో చేతులు చాపే  సంఖ్య లెక్క పెట్ట లేనంతగా ఉన్నందువల్లే. ఇంకెంతో మంది ముందుకు రావాలనే ఉద్దేశ్యంతో మాత్రమే!

Leave a comment